బాలీవుడ్‌లో నెపోటిజం ఎక్కువ, నెపో కిడ్స్‌దే డామినేషనని కామెంట్స్ వినిపిస్తున్నా ఎక్కడా తగ్గట్లేదు స్టార్ కిడ్స్. ఈ మాటలేవీ ఖాతరు చేయకుండా తమ వారసుల ఇండస్ట్రీలో దింపుతూనే ఉన్నారు స్టార్స్. ఈ ఏడాది కూడా అరడజన్ మందికి పైగా నెపో కిడ్స్ వెండితెరకు, డిజిటల్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ అయ్యారు. వీరిలో ప్రస్తావన నుండి తీసేయాల్సింది షారూక్ సన్ ఆర్యన్ ఖాన్, సైఫ్ సన్ ఇబ్రహీం అలీఖాన్. ఈ ఇద్దరు ఆర్యన్ డైరెక్టరుగా, ఇబ్రహీం హీరోగా ఓటీటీతో సరిపెట్టేశారు. వెండితెరపైకి వచ్చే ధైర్యం చేయలేదు. బాలీవుడ్ సగం సెలబ్రిటీలను నింపేసిన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సోసో షోగానే ముగిసింది. ఇబ్రహీం నాదానియా, సర్ జమీన్ కూడా సేమ్ రిజల్ట్
Also Read : The RajaSaab : రెబల్ స్టార్ ‘రాజాసాబ్’ సంక్రాంతికి వస్తుందా.. మరోసారి వాయిదా వేస్తారా?
బిగ్ స్క్రీన్‌పై డెబ్యూ ఇచ్చిన యంగ్ యాక్టర్లలో అహన్ పాండే మినహా మిగిలిన వారంతా కూడా ప్లాప్ మూటగట్టుకున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్, రవీనా టాండన్ రాషా తడానీ ఆజాద్‌తో వస్తే ప్రేక్షకులు తిప్పికొట్టరు. ఊయమ్మ పాటతో కాస్తో కూస్తో రిజిస్టరైంది మాత్రం రాషా. ఇప్పటికే డిజిటల్ స్క్రీన్‌పై లాంచైన అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్, జాన్వీ సిస్టర్ ఖుషీ.. లవ్ టుడే రీమేక్ లవ్యాపాతో వస్తే బొమ్మ బొక్క బోర్లా పడింది. ముఖ్యంగా ఖుషీ నటనకు వంకలు వెతికారు ఆడియన్స్. ఇక ఈ అక్కాచెల్లెళ్ల కజిన్ శానయ ఎప్పుడో హీరోయిన్ కావాల్సింది కానీ టైం బాగోక ఈ ఏడాది వచ్చి ఆఖోంకీ గుస్తాకియాతో ప్లాప్ మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఈ స్టార్ కిడ్స్ రిజల్ట్ ఇలా ఉంటే.. టెస్టుకు రెడీ అవుతున్నారు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, అక్షయ్ కుమార్ మేనకోడలు సిమర్ భాటియా. అత్యంత చిన్న వయస్సులోనే పరమ వీర చక్ర అవార్డ్ అందుకున్న ఆర్మీ అధికారి అరుణ్ ఖేతర్పాల్ జీవిత స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న ఇక్కీస్‌తో సిల్వర్ స్క్రీన్ స్టెప్ ఇన్ కాబోతున్నాడు అగస్త్యా. డిసెంబర్ బరిలో మూవీ రాబోతుంది. మరీ ఈ ఇద్దరు అహన్ సైడా..? లేక అటు వైపా..? అనేది ఇయర్ ఎండింగ్‌లో తేలిపోనుంది.
