Site icon NTV Telugu

Devara: అందరి ఎదురుచూపులు అందుకే!

Devara Jatharaa Begins

Devara Jatharaa Begins

All Eyes and Ears on First Talk From Devara Early Shows: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు ఆరేళ్ళ తరువాత రాబోతున్నారు. కాబట్టి ఆయన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేమికుల సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మునుపెన్నడూ లేనివిధంగా అమెరికాలో ప్రీమియర్స్ కాస్త ముందుగానే వేస్తున్నారు. దానికి తోడు ఇప్పటికీ ఒంటిగంట షోలు దాదాపు 528 పైగానే ప్లాన్ చేశారు. అంటే దాదాపుగా అమెరికాలో ప్రీమియర్స్ పడే టైంకి ఇండియాలో కూడా ఫాన్స్ స్పెషల్ షోలు పడబోతున్నాయి. అయితే ఈ షోల నుంచి ఎలాంటి టాక్ బయటకు రాబోతుంది? అనే విషయం మీద అందరి ఆసక్తి నిమగ్నమై ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అందరి కళ్ళతో పాటు చెవులు కూడా ఈ టాక్ వినేందుకు ఎదురు చూస్తున్నాయి. నిజానికి గతంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి ఇదేవిధంగా ఒంటిగంట షోలు ప్లాన్ చేశారు.

Devara : మాస్ జాతర మొదలైపోయింది!

అయితే ఆ సినిమాకి అవే మైనస్ అయ్యాయి. ఈ సినిమా విషయంలో కూడా అవి మైనస్ అవుతాయేమో అని ముందు నుంచి కాస్త హెచ్చరికలు వచ్చినా సరే కంటెంట్ మీద నమ్మకంతో రంగంలోకి దిగింది సినిమా టీం. కాబట్టి ఈ షోస్ కి వచ్చే టాక్ రేపటి నుంచి థియేటర్లలో దేవర సినిమాకి నమోదయ్యే ఆక్యుపెన్సీని డిసైడ్ చేస్తుంది అని పలువురు విశ్వసిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సినిమా హైప్ విషయంలో కొంత బ్యాలెన్స్ ఉండనే ఉంది. సినిమా టీం ఎంత లేపాలని ప్రయత్నిస్తున్న అభిమానుల్లో మాత్రం కొంత క్లారిటీ ఉంది. కాబట్టి ఈ సినిమా విషయానికి వస్తే కొన్ని పేలే డైలాగులతో పాటు యాక్షన్ సీక్వెన్స్ పడితే ఒక రేంజ్ లో సినిమా టాక్ బయటకు వస్తుంది. దానికి తోడు ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా అద్భుతంగా ఉందని రిపోర్టులు బయటకు వస్తున్నాయి. కాబట్టి సినిమాకి సాలిడ్ టాక్ రావడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. అదే సాలిడ్ టాక్ గనక బయటకు వస్తే సినిమా ఆపటం ఇంకా ఎవరి తరం కాదు అని ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. అయితే చూడాలి మరికొద్ది గంటల్లో దేవర తుఫాన్ ఎలా తీరని దాటబోతోంది అనేది.

Exit mobile version