Site icon NTV Telugu

Alia : అలియా నిర్మాణంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరి..

Aliya

Aliya

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రాండ్ తో వచ్చినప్పటికి తన టాలెంట్‌తో అందం నటనతో తన కంటూ ఒక గుర్తింపు, స్టార్‌డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో ‘RRR’ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియాకు, ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల నేషనల్ అవార్డు కూడా అందుకున్న అలియా ఎంతో ఆనందంగా ఉంది. సినిమాల విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమె సంతోషంగా జీవిస్తోంది. ప్రజంట్  ‘ఆల్ఫా’, ‘లవ్ అండ్ వార్’ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది. అయితే నటనతో మెప్పిస్తూనే.. నిర్మాతగా రాణిస్తున్న అలియా తాజాగా తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్లైన్ ప్రొడక్షన్స్లో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం.

Also Read: MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ డేట్ లాక్ ?

కాగా ఈ సిరీస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా రాబోతుందట. ఓ కళాశాలలో రెండు యువ జంటల చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుందట. దీని కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక ప్రారంభమైంది. అయితే ఈ సిరీస్‌లో కొత్తవాళ్లను తెరకు పరిచయం చేయాలని అలియా గట్టి ప్లాన్‌లో ఉందట. అలాగే ఈ ప్రాజెక్ కోసం అప్పుడే అమెజాన్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకోగా త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version