NTV Telugu Site icon

Ali: రాజకీయాలకు అలీ గుడ్ బై.. ఏ పార్టీ వాడిని కానంటూ వీడియో విడుదల

Ali Resigns Ysrcp

Ali Resigns Ysrcp

ALi Resigns YSRCP: 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన అలీ 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను అప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టానని ఆయన అన్నారు. ఆయన బాపట్లలో ఎంపీగా నిలబడుతున్నాను నువ్వు వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని ఆయన అన్నారు. 20 ఏళ్లు అందులో ఉన్న తర్వాత వైసీపీలో చేరానని అన్నారు. ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ అని, 45 ఏళ్లు ఆరు భాషలు 1200 పైచిలుకు సినిమాల్లో నటించానని అన్నారు. నాకు ఎంతో కొంత భగవంతుడు దయా గుణం ఇచ్చాడు, దానికి రాజకీయ బలంతోడైతే ఇంకా సేవ చేయొచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేయాలని రాలేదు.

Darshan Khaidi No 6106: ఇదేం పిచ్చిరా మీకు.. చంపి జైలుకెళ్తే స్టిక్కర్లు వేయిస్తారా?

మా నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టి కరోనాలో కూడా ఆపకుండా 16 ఏళ్లుగా సేవ చేస్తున్నాను, ఆ ట్రస్టు ద్వారా నేను ఎంతో మందిని చదివించానని అన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలను పొగుడుతాను కానీ ఇతర పార్టీల నేతలను ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదు. ఈ మేరకు మీరు వెతకినా నేను ఎవర్ని అయినా దూషించిన వీడియో దొరకదని అలీ అన్నారు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఏ పార్టీ సపోర్టర్ ను కాదని అలీ క్లారిటీ ఇచ్చారు. ఇక మీదట నా సినిమాలు, నా షూటింగ్స్ నేను చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికే మీ ముందుకు వచ్చానని ఆయన వీడియోలో పేర్కొన్నారు. నేను కూడా మీలాగే ఒక కామన్ మ్యాన్ లాగా ఐదేళ్లకు ఒకసారి వెళ్లి ఓటు వేసి వస్తాను అని ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని ఆయన అన్నారు. గత వైఎస్ జగన్‌ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీ వ్యవహరించారు.