Site icon NTV Telugu

“అల అమెరికాపురములో” థమన్ లైవ్ కాన్సర్ట్

ALA Amerikapurramullo Biggest Live concert ever by Young Musical Sensation Thaman

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన “అల వైకుంఠపురంలో” చిత్రానికి థమన్ అందించిన సంగీతం, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికి తెలిసిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ దాదాపు 2 బిలియన్ హిట్‌లను సాధించి ఇది అద్భుతమైన రికార్డు సృష్టించింది. తాజాగా థమన్ యుఎస్ఎలో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

Also Read : మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన సూర్య

ఈ లైవ్ కాన్సర్ట్ కు ఆసక్తికరంగా “అల అమెరికాపురములో” అని పేరు పెట్టారు. ఈ కచేరీ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వాషింగ్టన్ డి.సి, చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్, డల్లాస్ వంటి ప్రధాన యూఎస్ నగరాల్లో జరుగుతుంది. తమన్ తన బృందంతో పాటు యువ ప్లేబ్యాక్ గాయకుల బృందంతో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. భారతీయ చలన చిత్ర పంపిణీ, మ్యూజికల్ కాన్సర్ట్ ప్రొడక్షన్, ప్రసిద్ధ అంతర్జాతీయ డెలివరీ భాగస్వామి అయిన హంసిని ఎంటర్టైన్మెంట్ తమన్ సంగీత కచేరీని నిర్వహించనుంది.

Exit mobile version