“ఆకాశం నీ హద్దురా” హిందీ రీమేక్… హృతిక్ స్థానంలో మరో హీరో ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో మరో హీరో పేరు విన్పిస్తోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ “సూరారై పొట్రు”లో హీరోగా కన్పించబోతున్నాడట. గతంలో అక్షయ్ కుమార్ “రౌడీ రాథోడ్, భూల్ భూలైయా, లక్ష్మి బాంబ్” వంటి హిందీ రీమేక్ లలో నటించాడు. ఇప్పుడు ఆయన “సూరారై పొట్రు” రీమేక్ లో సూర్య పాత్రలో నటించడానికి సిద్దమయ్యారు. ఈ చిత్రాన్ని సూర్య 2డి ఎంటర్టైన్మెంట్, విక్రమ్ మల్హోత్రా అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Also : “ఆర్ఆర్ఆర్”లో రామ్ చరణ్ సర్పైజ్ లుక్
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ఇక “సూరారై పొట్రు” విషయానికొస్తే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో విడుదలైంది. కన్నడ, మలయాళంలో అదే టైటిల్ తో, తెలుగులో “ఆకాశం నీ హద్దురా” పేరుతో రిలీజ్ అయ్యింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవల “షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2021″కు ఎంపికైంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, మోహన్ బాబు, కృష్ణకుమార్, వివేక్ ప్రసన్న, కరుణలు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. థియేటర్లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల చేయబడింది.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!