NTV Telugu Site icon

Sumanth: అక్కినేని సుమంత్ ‘అనగనగా’.. టీజర్

February 7 2025 02 23t072403.319

February 7 2025 02 23t072403.319

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో సుమంత్ ఒక్కరు. కెరీర్ పరంగా భారీ హిట్ అందుకోలేకపోయిన హీరోగా అనేక మంచి సినిమాలతో ఆడియన్స్‌ను ఎంతో అలరించి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్న సుమంత్ ఇప్పుడు ‘అనగనగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ వంటి పలువురు నటినటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాకేష్ రెడ్డి, రుద్రా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనిలో ఉంది. ఇందులో భాగంగా తాజాగా టీజర్ విడుదల చేశారు మూవీ టీం.

కథ అంటే ఏంటి అవి ఎందుకు.. అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఈ మూవీలో సుమంత్‌ టీచర్ గా కనిపించనున్నారు. ఆయన పిల్లలకు చదువు బట్టి పట్టించుకుండా, ప్రెజర్ పెట్టకుండా విద్యను నేర్పిద్దామనుకుంటాడు. కానీ ఆయన భావాన్ని అందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. దీంతో ఒంటరిగా పోరాడుతూ కనిపించాడు. మరి చివరికి ఏం జరిగిందనేది సినిమా. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా నేచరుల్‌గా ఆకట్టుకున్నాయి. సుమంత్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి కనిపించారు. ఓవరాల్ గా టీజర్.. చాలా బాగుంది. దీంతో మూవీ పై అంచనాలు కూడా పెరిగిపోయాయి. మొత్తానికి సుమంత్ చాలా గ్యాప్ తర్వాత మంచి కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఉగాది కానుకగా మార్చి 30న స్ట్రీమింగ్ చేయనున్నారు.