Site icon NTV Telugu

Akira Nandan : అకిరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. కానీ

Akiranandan

Akiranandan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా నందన్.  అకిరా నటన తో పాటు మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు.

Also Read : HariHara VeeraMallu : ప‌వ‌న్ ఫ్యాన్స్ కు ఏఎం ర‌త్నం గుడ్‌న్యూస్‌!

ఇటీవల తండ్రి పవన్ తో కలిసి సనాతన ధర్మ యాత్ర కూడా చేసాడు అకిరా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అయితే అకిరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాల సమాచారం. కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో కాదని కూడా వెల్లడించారు. అందుకు సుమారుగా రెండు సంవత్సరాలకు పైగానే సమయం ఉందని ఆ తర్వాత మాత్రమే అకిరా ఎంట్రీ ఉంటుందని తెలిపారు. ఈ లోగ నటనలోను అలాగే డాన్స్ మిగిలిన విభాగాలలోను పూర్తీ స్థాయిలో శిక్షణ తీసుకొనునున్నాడట అకిరా. అయితే అకిరా ఇప్పటికే దర్శకత్వ శాఖలోనూ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గాను ప్రావిణ్యం సాధించాడు. తన తండ్రి నటిస్తున్న OG సినిమాకు తమన్ తో కలిసి వర్క్ చేస్తున్నాడట అకిరా. త్రివిక్రమ్  డైరెక్షన్ లో అకిరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్సీ కోరుతున్నారు.

Exit mobile version