Site icon NTV Telugu

Akhil : ‘లెనిన్’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్.. !

Lenin, Akhil

Lenin, Akhil

అక్కినేని అఖిల్‌ హీరోగా పరిచ‌య‌మైన‌ప్పటి నుంచి ఇప్పటివ‌ర‌కు చెప్పుకోద‌గ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ ఖాతాలో లేదు. ఎన్నో ఆశ‌ల‌తో ఒళ్లు హూనం చేసుకుని మ‌రీ ‘ఏజెంట్’ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒక‌టిగా మిగిలింది. దీంతో అఖిల్ ఏజెంట్ త‌ర్వాత బాగా టైమ్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తో సెట్ చేసుకున్నాడు.రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ విలేజ్ ల‌వ్ స్టోరీగా తెరకెక్కుతున్నా ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Also Read : Abhirami: కమల్ హాసన్‌తో లిప్ కిస్ పై స్పందించిన నటి అభిరామి..

ఈ మూవీలో అఖిల్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఈ మూవీపై మంచి హైప్ పెంచేశాయి. చిత్తూరు ప్రాంతం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అఖిల్ చిత్తూరు యాస‌లోనే మాట్లాడ‌బోతున్నాడట‌. మిల్క్ బాయ్‌లా ఉండేవాడు కాస్త డిగ్లామర్ లుక్‌లో కనిపించాడు.. మొత్తనికి అఖిల్ చాలానే క‌ష్టప‌డుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది..ఈ సినిమాలో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. కాగా ఈ స్పెషల్ సాంగ్ ను క్రేజీ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చేత చేయించాలని మేకర్స్  ఫిక్స్ అయ్యారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో చూడాలి.

Exit mobile version