NTV Telugu Site icon

Akhil : యూట్యూబ్ లో ‘అయ్యగారి’ లెనిన్ నం -1

Akhil Lenin

Akhil Lenin

అఖిల్ అక్కినేని హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్  నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తాజాగా ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న (ఏప్రిల్ 8)న అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని లెనిన్ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు.. అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తుంటే లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో తెరకెక్కించినట్టు క్లియర్‌గా అర్ధమవుతుది. ముఖ్యంగా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిందనే చెప్పాలి.

Also Read: Tamannaah : నేను ఒంటరిదాన్నే.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..

ఇదిలా ఉండగా లెనిన్ టైటిల్ గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రజంట్ యూట్యూబ్‌ లో టాప్‌ లో ట్రెండింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని మూవీ టీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అఖిల్ ను మునుపెన్నడు చూడని లుక్ లో కనిపించడం అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.  శ్రీ లీల ఈ సినిమాలో డిఫరెంట్‌గా రెండు జడలలో  కనిపించింది. వరుస డిజాస్టర్స్ తర్వాత అటు అఖిల్ ఇటు శ్రీ లీల చేస్తున్న ఈ సినిమాతో సాలిడ్ హిట్ ఇస్తారని ఇరువురి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.,