Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!

Lenin

Lenin

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, తాజాగా వంద కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ఊచకోత కోసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ సినిమా ఆగస్ట్ 7 నుంచి అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 90ల కాలం నాటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతి ఏటా అక్కడ 18 రోజుల పాటు జరిగే ద్రౌపదమ్మ జాతర సమయంలో ఎలాంటి రక్తపు చుక్క చిందకూడదనే కఠినమైన ఆచారం ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామానికి అనాథ అయిన లెనిన్ (అఖిల్) అడుగుపెడతాడు. ఈశ్వరీరావు, ఆమె తనయుడు ప్రమోద్ పంజు అతన్ని ఆదరిస్తారు. క్రమంగా అఖిల్, ప్రమోద్ మంచి స్నేహితులుగా మారుతారు. ఇదే సమయంలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సె మధ్య ప్రేమ చిగురిస్తుంది.

అయితే ఊహించని పరిణామాల మధ్య కథ అనేక సంచలన మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో అఖిల్ జైలు పాలు కావాల్సి వస్తుంది. అసలు లెనిన్ ఎందుకు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది? జైలు నుంచి వచ్చాక అతను ఎవరిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? లాంటి అనేక ఉత్కంఠభరితమైన విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో అఖిల్ ఇప్పటివరకు చేయని విధంగా రా అండ్ రస్టిక్ పాత్రలో నటించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక భాగ్యశ్రీ బోర్సె తన గ్లామర్‌తో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నారు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రాసుకున్న కథ, కథనం, టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తమన్ అందించిన మాస్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఈ విజువల్ వండర్‌ను మరింత పరిపుష్టం చేశాయి.