Site icon NTV Telugu

Akhanda 2: 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్..అఖండ 2 రికార్డ్

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా అఖండ టూ తాండవం అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Also Read:Marriage: సోనమ్, ముస్కాన్, నిఖితా.. పెళ్లంటేనే భయపడుతున్న మగాళ్లు..

ఇక ఈ సినిమా నుంచి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అద్భుతంగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే, కొంచెం ఎబౌట్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే, ఈ టీజర్‌కి రికార్డు వ్యూస్ వచ్చాయి. 24 గంటలలో 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ టీజర్ ఇంకా యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

Also Read:Ram Charan : రామ్ చరణ్‌ తో త్రివిక్రమ్ మూవీ అప్పుడేనట..

అంతేకాక, ఈ వీడియోకి యూట్యూబ్‌లో 590Kకి పైగా లైక్స్ వచ్చాయి. అలాగే, టాలీవుడ్‌లో టాప్ ఫైవ్ మోస్ట్ most-viewed టీజర్స్‌లో స్థానం సంపాదించడమే కాక, సీనియర్ స్టార్ హీరోలలో ఇది ఒక ఆల్ టైం రికార్డ్‌గా నిలుస్తోంది. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version