Site icon NTV Telugu

Big News : ఒక రోజు ముందుగా అఖండ 2.. స్పెషల్ ప్రీమియర్స్

Akhanda 2 (2)

Akhanda 2 (2)

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ‌-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది అఖండ 2.

Also Read : RAPO : రామ్ తో సినిమా.. అనిల్ రావిపూడి రియాక్షన్ ఏంటంటే?

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం బెంగుళూరులో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబందించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల కాలంలో చిన్న, భారీ సినిమాలు అని తేడా లేకుండా రిలీజ్ కు ఒకరోజు ముందుగానే పైడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ టాక్ బాగుంటే ఓపెనింగ్ డే రోజు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అదే టాక్ తేడా వస్తే మాత్రం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు రాబోతున్న అఖండ 2 ను అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందుగా డిసెంబరు 4న పైడ్ ప్రీమియర్స్ వేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతుల కోసం జీవో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కంటెంట్ పట్ల మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న అఖండ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Exit mobile version