Site icon NTV Telugu

Kanda2 : ‘అఖండ 2’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

Akanda 2

Akanda 2

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్‌’గా అలరించిన ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నారు. బాలయ్య – బోయపాటి కాంబోతో పాటు బ్లాక్‌బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

Also Read : Bollywood : అర్ధనగ్నంగా వీధుల్లో బాలీవుడ్ బ్యూటీ.. మండిపడుతున్న నెటిజన్లు

దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి అప్‌డేట్ బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం తర్వాత షెడ్యూల్ ప్రయాగరాజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ దాదాపు రెండు వారాలు అలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా దాదాపు షూటింగ్ మొత్తం ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుందట. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

Exit mobile version