Site icon NTV Telugu

Akhanda 2: హైకోర్టులో షాక్… అయినా ప్రీమియర్స్ ఆన్ ట్రాక్.. పుకార్లను నమ్మవద్దు!

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అనేక వాయిదాల అనంతరం రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు, ప్రీమియర్ షోల నిర్వహణకు ముందు తెలంగాణ హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు (డిసెంబర్ 11) తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది.

Also Read:Sankranthi 2026: సంక్రాంతి కామెడీ సిండికేట్.. కూడబలుక్కుని వస్తున్నట్టున్నారే !

అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో సతీష్ కమల్ పిటిషనర్‌గా ఉన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇవాళ (11వ తేదీ) ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) మరియు సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసి, విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వ జీవో సస్పెండ్‌తో, తెలంగాణలో ‘అఖండ 2’ ప్రీమియర్ షోల నిర్వహణ, టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం నెలకొంది.

Also Read:Akhanda 2: ‘అఖండ 2’కు కోర్టులో బిగ్ షాక్: ప్రీమియర్ షోకి ముందు జీవో సస్పెండ్!

పుకార్లను నమ్మవద్దు: ‘అఖండ 2’ టీమ్ క్లారిటీ
హైకోర్టులో ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రీమియర్ షోల రద్దుపై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీంతో, ‘అఖండ 2’ టీమ్ వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. “ప్రీమియర్ షోల గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దు. #Akhanda2 GRAND PREMIERS TONIGHT (ఈ రాత్రి) కోసం అన్నీ పూర్తిగా ట్రాక్‌లో ఉన్నాయి. థియేటర్లలో #Akhanda2Thaandavam ను ఆస్వాదించండి.” అని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీనితో, తెలంగాణాలో ప్రీమియర్ షోలు అనుకున్న ప్రకారమే జరగనున్నట్లు స్పష్టమైంది. ‘అఖండ 2’ చిత్రంలో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించారు.

Exit mobile version