Site icon NTV Telugu

Akhanda 2: అఖండ 2’కి లాస్ట్ మినిట్ షాక్..శ్రీశైలంలో బోయపాటి, తమన్

Boyapati

Boyapati

అనేక వాయిదాల అనంతరం రేపు విడుదల కావాల్సిన ‘అఖండ 2’ చిత్రం, ప్రీమియర్స్ నిర్వహణకు మరికొద్ది గంటల సమయం ఉండగా, ఊహించని షాక్‌ను ఎదుర్కొంది. సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ రోజు (తేదీ) తెలంగాణ హైకోర్టులో ‘అఖండ 2’ సినిమా ప్రత్యేక ప్రదర్శనల నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలను పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్‌-మోషన్ పిటిషన్ దాఖలైంది. పాదూరి శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్‌గా, సతీష్ కమల్ పిటిషనర్‌గా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Also Read : OTT : ఓటీటీలో ఒక్కరోజే 11 సినిమాలు.. చూసేందుకు స్పెషల్‌గా 9 – తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 రిలీజ్

పిటిషన్‌లో ముఖ్యంగా ‘అఖండ 2’ ప్రత్యేక ప్రదర్శనలు (ప్రీమియర్ షోలు) నిర్వహించడం. టికెట్ ధరలను పెంచడం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసు విచారణ ఈ రోజు మధ్యాహ్నం గంటలకు హైకోర్టులో రావచ్చని సమాచారం. హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. కోర్టు విచారణ అనంతరం ఈ పిటిషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read :Big Breaking : అఖండ 2 పై తెలంగాణ హై కోర్టులో పిటిషన్.. ప్రీమియర్స్ పై ఉత్కంఠ

మరోపక్క శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జున స్వామివారి సేవలో అఖండ మూవీ టీమ్ సందడి చేసింది. ఈ బృందంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో ఆది, అశ్విన్ సహా పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. ఆలయ రాజగోపురం వద్ద బోయపాటి శ్రీను, తమన్‌లకు ఆలయ అర్చకులు, ఏఈవో హరిదాస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా కలిసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

Exit mobile version