అజిత్ ఇంట్లో బాంబు… అసలు విషయం తేల్చిన పోలీసులు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. అయితే అసలు విషయం ఏంటో తేల్చేశారు పోలీసులు. మే 31 న తమిళనాడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు అజిత్ ఇంట్లో బాంబు ఉన్నట్లుగా అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అజిత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన ఇంట్లో సెర్చ్ చేసి అదొక భూటకపు కాల్ గా గుర్తించారు. ఆ నెంబర్ ను ట్రేస్ చేయగా… అది దినేష్ అనే మానసిక వికలాంగుడి కాల్ అని పోలీసులకు తెలిసింది. అజిత్ ఇంజంబక్కం ఇంటికి నకిలీ బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. కాగా గత సంవత్సరం సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్ లకు ఇలాంటి కాల్స్ చేసినది దినేష్ అని నివేదికలు సూచిస్తున్నాయి. తల్లిదండ్రులను హెచ్చరించడానికి పోలీసులు దినేష్ ఇంటికి వెళ్లారు. అంతకుముందు పోలీసు అధికారులు దినేష్ కు మొబైల్ ఫోన్ ఇవ్వవద్దని వారి కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు. అతను మళ్ళీ ఏదో విధంగా దినేష్ ఫోన్ పట్టుకుని పోలీసు కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు. దీంతో దినేష్ కుటుంబ సభ్యులను మరోసారి పోలీసులు హెచ్చరించారు. ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే… అజిత్ నెక్స్ట్ మూవీ “వాలిమై” చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో స్పెయిన్‌లో చిత్రీకరించబడే ఫైట్ సీక్వెన్స్ మినహా మేకర్స్ ఈ చిత్రంలో ఎక్కువ భాగం పూర్తయ్యింది.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!