Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?

Daredevil

Daredevil

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ చిత్రంగా డేర్‌డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతేడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఆధిక రవిచంద్రన్‌కు మరోసారి అవకాశం ఇచ్చాడు అజిత్. ఇటీవల డేర్‌డెవిల్ సినిమాను అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పలు భాషల సూపర్ స్టార్లను భాగం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు దిగ్గజ నటులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అజిత్ కుమార్ భార్య షాలిని అజిత్ కుమార్ తన కొత్త నిర్మాణ సంస్థ బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై  భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా  అభినందన్ రామానుజమ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. చిత్ర బృందం త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన ఇతర అధికారిక ప్రకటనలను విడుదల చేయనున్నట్లు సమాచారం.