తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అజిత్ లేటెస్ట్ సినిమాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఆయన సినిమాలు లేట్ అయినప్పటికీ వాటిని చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అజిత్ కుమార్ మాజిద్ తిరుమేని దర్శకత్వంలో ‘ విదా ముయార్చి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని చాలా యాక్షన్ సన్నివేశాలను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇక ఇదే సందర్భంలో నిర్మాణ సంస్థ లైకా విడుదల చేసిన అజిత్ కారు యాక్సిడెంట్ వీడియో చాలా మందిని షాక్ కి గురి చేసింది. ఇందులో నటుడు అజిత్ కుమార్ బాడీ డబుల్ లేకుండా కారును వేగంగా నడుపుతున్నాడు. సాధారణంగా పెద్ద హీరోలు రిస్కీ షాట్స్ చేయడానికి ఇష్టపడరు. స్టంట్ లు, కొంచెం కష్టపడాల్సిన రోప్ ఫైట్స్ కూడా వారి ప్లేస్ లో వారి బాడీ డబుల్స్ చేస్తూ ఉంటారు.
Also Read: Mrunal Thakur: రోజూ ఏడ్చేదాన్ని.. తెలుగు సినిమాల్లో నటించొద్దనుకున్నా: మృణాల్ ఠాకూర్
కానీ అజిత్ మాత్రం తాను స్వయంగా కారు నడుపుతూ ఉన్న క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. అయితే ఇది అజిత్ పొరపాటున నడుపుతూ ఉండగా బోల్తా పడిందా లేక సినిమా కోసం ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఆ అనే విషయం మీద క్లారిటీ లేదు. చాలామంది అయితే ఇది సినిమాలో భాగమై అని అంటున్నారు. ఇక కారు బోల్తా పడుతున్న షాట్ ని కారులో ఉన్న కెమెరాలో బంధించారు. ఇందులో అజిత్ కారు నడుపుతూ ప్రమాదానికి గురవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కోసం నటుడు అజిత్ కుమార్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో మీద అజిత్ అభిమానులు అయితే ఒకపక్క టెన్షన్ పడుతూనే మరోపక్క సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లే నటులలో నువ్వూ ఒకడివి అని ఒప్పేసుకుంటాం అంటూ ఆయన మీద తమ అభిమానాన్ని చాటుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
