Ajith Kumar: థలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!

Tollywood

Tollywood

Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో, దక్షిణాది చిత్ర పరిశ్రమలో అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్న నటుడు ‘థలా’ అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి మోహిని మణి (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సినిమాలతోనే కాకుండా కార్ రేసింగ్, బైక్ టూరింగ్ లాంటి సాహసాలతో ఎప్పుడూ బిజీగా ఉండే అజిత్.. తన తల్లి మరణంతో తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ వార్త అజిత్ అభిమానులతో పాటు తమిళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అజిత్ మాతృమూర్తి మరణవార్త తెలియగానే తమిళ సినీ, రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అజిత్ కుటుంబానికి తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, లోకనాయకుడు కమల్ హాసన్, బీజేపీ నేత అన్నామలై తదితర ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

×
×
Ad