ఇండియాలో సినిమా, క్రికెట్… ఈ రెండిటి క్రేజ్ గురించి మళ్లీ చెప్పాలా? అయితే, ఒక్కోసారి మూవీస్ అండ్ క్రికెట్ కలసిపోతుంటాయి. అటువంటప్పుడే మామూలు జనం ఆసక్తి రెట్టింపు అవుతుంది. తాజాగా తల అజిత్ ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్ కి సినిమా క్రేజ్ ని జోడించారు. ‘వలిమై’ సినిమా అప్ డేట్ కావాలంటూ మరోసారి ప్లకార్డులు ప్రదర్శించారు. సౌతాంప్టన్ లో జరుగుతోన్న ఇండియా, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో అజిత్ ఫ్యాన్ గా భావింపబడుతోన్న ఓ వ్యక్తి ‘వలిమై అప్ డేట్’ అంటూ ఇంగ్లీషులో రాసిన కార్డ్ చూపించాడు!
Read Also : ‘కొట్టుకుందాం… రా!’ అంటూ ‘ఖిలాడీ’ అక్షయ్ కి అండర్ టేకర్ ఆహ్వానం!
‘వలిమై అప్ డేట్’ అంశం క్రికెట్ మ్యాచ్ మధ్యలో తలెత్తటం ఇప్పుడే మొదటిసారి కాదు. గతంలో చెన్నైలోని స్టేడియంలో ఇండియన్ టీమ్ మ్యాచ్ ఆడుతుండగా ఫ్యాన్స్ నానా అల్లరి చేశారు. అప్పుడు ‘వలిమై’ అప్ డేట్ కావాలంటూ డిమాండ్ చేశారు. వార్ని లైవ్ మ్యాచ్ సందర్భంగా కెమెరాల్లో ప్రత్యేకంగా చూపించారు! ఇప్పుడే అదే పని దేశం కానీ దేశంలోనూ ‘వలిమై’ మూవీ ఫ్యాన్స్ చేసేశారు! దీనిపై అజిత్ ఏమంటాడో చూడాలి మరి? గతంలో మాత్రం ‘కంట్రోల్ ఉండా’లంటూ అభిమానులకి హితవు పలికాడు. ‘నెర్కొండ పార్వై’ సినిమా తరువాత దర్శకుడు వినోద్ తో అజిత్ చేస్తోన్న చిత్రం ‘వలిమై’. కరోనా ఎఫెక్ట్ తో సినిమా ఆలస్యం అవుతోంది. అయితే, మేకర్స్ నుంచీ ఎటువంటి అప్ డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు.