Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Bhupathi: ‘RX100’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఆయన తన కెరీర్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన పిలుపు తనను ఎంత ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “‘RX100’ తర్వాత మహేష్ బాబు గారు నన్ను పిలిచారు. నా పనిని అభినందిస్తారని అనుకుని వెళ్లాను. కానీ ఆయన నాకు ఒక కథ చెప్పమని అడిగారు. అది విని నేను షాక్ అయ్యాను” అని వెల్లడించారు.
ఆ సమయంలో తాను వెంటనే ఓ ఆసక్తికరమైన కథను మహేష్ బాబుకు వినిపించానని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు కాలం, హంపి చుట్టూ ఉన్న రహస్యాలు, మిస్టరీల నేపథ్యంలో ఒక కథను ఆయనకు నేరేట్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ కథను తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఉంచుకోవాలని మహేష్ బాబు సూచించారని అజయ్ భూపతి వెల్లడించారు. మరోసారి తనను కలవడానికి వచ్చే సమయంలో ఒక మంచి కమర్షియల్ స్టోరీతో రావాలని మహేష్ బాబు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్‌గా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రేమ, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తన కథపై ఆసక్తి చూపడం తనకు ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని అజయ్ భూపతి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Hi: ఆగస్టు 14న కవిన్‌తో కలిసి 'హాయ్' అంటూ నయనతార హంగామా
తాజావార్తలు
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!