ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమిత బైజు హీరోయిన్ గా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని తెలుగు సహా తమిళంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ మమిత అనే అందరూ అనుకున్నారు, కానీ వాస్తవానికి ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. నిజానికి ఆమె చాలా సీన్స్‌లో కనిపిస్తుంది, కానీ ఆమె నోటీస్ అయింది మాత్రం దాదాపుగా రెండు షాట్స్‌లో. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు, ఐశ్వర్య శర్మ.
Also Read : Bigg Boss 9 : దివ్వెల మాధురి వల్ల రీతూ చౌదరికి పెరుగుతున్న క్రేజ్..
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ భామ, తెలుగులో ‘డ్రింకర్ సాయి’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ హీరోతో ఆమెకు ఎఫైర్ ఉందంటూ ఆ హీరో భార్య గౌతమి చౌదరి ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ భామ ఆ విషయాలపై స్పందించలేదు, కానీ ఇప్పుడు ఏకంగా ‘డ్యూడ్’ సినిమాలో కీలకపాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఆమె చేసిన పాత్ర చిన్నది అయినా, ఆమె పాత్ర మాత్రం అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. అలా అసలు సైలెంట్‌గా ఆమె ఈ సినిమా చేసేసినట్లే చెప్పాలి.
