నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారు, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఐశ్వర రాజేష్ కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమంటే గ్రేట్ ఇండియన్ కిచెన్ గురించి ప్రస్తావన రావడంతో తాను ఓసీడీ పర్సన్ అని చెప్పుకొచ్చింది.
Aishwarya Rajesh: నన్ను ఆడిషన్ అడిగితే షాక్ అయ్యా!!
ఏ విషయమైనా క్లీన్ గా లేకపోతే తనకు పిచ్చెక్కిసినట్లు అనిపిస్తుందని ముందు దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే వేరే పని మీద దృష్టి పెడతానని ఆమె కామెంట్స్ చేసింది. అంతేకాక ఆమె మాట్లాడుతూ తన అన్న కొడుకుకి ఏడేళ్ల వయసు ఉంటుందని వాడు తమ ఇంటికి వచ్చినప్పుడు ఆట వస్తువులు చిందరవందరగా పడేస్తాడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తమ మేకప్ కిట్ లోని లిప్స్టిక్ తీసుకొని దానితో 8 నెంబర్ వేయడం ప్రాక్టీస్ చేస్తాడని చెప్పుకొచ్చారు. నిజానికి తనకు ఎయిట్ అంతగా అచ్చిరాని నెంబర్ అని తనకు అది బ్యాడ్ సెంటిమెంట్ అనే ఫీలింగ్ ఉండేదని ఆమె పేర్కొన్నారు. వాడు మాత్రం ఆ 8 వేయడం మా ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడని ఎప్పుడైనా ఇంటికి వచ్చిన స్నేహితులు బంధువులు కూడా ఇదేంటి ఎయిట్ ప్రాక్టీస్ చేయిస్తున్నామని అనే వాళ్ళని ఆమె పేర్కొన్నారు. కొన్ని సందర్భాల వల్ల ఎయిట్ బ్యాడ్ సెంటిమెంట్ అని నేను ఫిక్స్ అయ్యాను కానీ ఒక్కోసారి ఎయిట్ నెంబర్ తో కూడా మంచి జరిగిందని ఆమె పేర్కొన్నారు.