ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు గ్లోబల్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ప్రతిఏటా తనదైన ప్రత్యేకమైన అవుట్‌ఫిట్స్‌తో రెడ్ కార్పెట్‌పై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే ఐష్.. ఈ ఏడాది కూడా ఊహించని రేంజ్ లుక్‌తో ఇంటర్నెట్‌ను పూర్తిగా షేక్ చేశారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన ఒక అద్భుతమైన గౌన్‌లో ఆమె కేన్స్ వేదికపై క్వీన్‌లా మెరిశారు.
డిజైనర్ అమిత్ అగర్వాల్ కలెక్షన్ నుండి ‘లుమినారా’ (Luminara) అనే డీప్ శాఫైర్-బ్లూ (గాఢ నీలిరంగు) గౌన్‌ను ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఈ డ్రెస్ వెనుక ఉన్న కష్టం, దాని సాంకేతిక ప్రత్యేకత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సమాచరం ప్రకారం ‘క్రిస్టల్ వీన్’ ఎంబ్రాయిడరీ టెక్నిక్‌ను ఉపయోగించి దాదాపు 1,500 గంటల పాటు (సుమారు 62 రోజులు) కేవలం చేతిపనితోనే ఈ గౌన్‌ను ఎంతో నిశితంగా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ మరో ప్రత్యేకత ఏంటంటే.. దీనిపై కెమెరా ఫ్లాష్ లైట్ పడినప్పుడు గౌన్ లోపల ఏదో లిక్విడ్ (ద్రవం) కదులుతున్నట్లుగా ఒక విజువల్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కేన్స్ వేదికపై అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుతమైన శాఫైర్-బ్లూ గౌన్‌కు మ్యాచ్ అయ్యేలా ఐశ్వర్యారాయ్ మెడలో డైమండ్-శాఫైర్ కాలర్ నెక్లెస్ ధరించారు. సిల్కీ ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో ఆమె రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే అచ్చం ఒక దేవకన్యలా మెరిసిపోయారు.
ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. ఇప్పటివరకు ఆమె రికార్డు స్థాయిలో 24 సార్లు కేన్స్‌కు హాజరయ్యారు. 2002లో షారుఖ్ ఖాన్ నటించిన ‘దేవదాస్’ సినిమా ప్రీమియర్ కోసం ఆమె తొలిసారిగా ఈ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ అదే గ్రేస్, అదే అందంతో కేన్స్ వేదికను రూల్ చేస్తూ నెటిజన్ల చేత ‘కేన్స్ క్వీన్’ అనిపించుకుంటున్నారు.. ‘ఐశ్వర్య ఎప్పుడూ కేన్స్ వేదికను తనదైన స్టైల్‌తో రూల్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆమెను ఒక క్వీన్‌గా ప్రెసెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎంతో శ్రమించి ఈ లుక్‌ను డిజైన్ చేశాం’ అని డిజైనర్ అమిత్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.
