Site icon NTV Telugu

OG: ‘ఓజీ’ పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ సింగర్స్

Og

Og

టాలెంటును వెలికితీసేందుకు సరైన వేదికలు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆహా, మరో సారి యువ గాయకుల ప్రతిభను వెలికి తీసింది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న నజీర్, భరత్ రాజ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’లో పాటకు పాడే చేసే అవకాశం పొందారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో జడ్జిగా వ్యవహరించారు.

Also Read:Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?

అప్పట్లో నజీర్, భరత్ రాజ్‌కి తన సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చిన తమన్, ఇప్పుడు అదే మాట నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ‘ఫైర్ స్ట్రామ్’ పాటలో ఈ యువ గాయకుల గొంతు వినిపించనుంది. ఇదే క్రమంలో, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే యుఎస్ ఆడిషన్స్ విజయవంతంగా ముగిశాయి. ఎంపికైన గాయకులు త్వరలోనే గోల్డెన్ టికెట్ పోటీలో తలపడనున్నారు. ఈవేళ ఆహా నిర్వహిస్తున్న ఈ సంగీత పోటీ దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ యువ గాయనగాయకులకు తన ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా మారుతోంది.

Exit mobile version