Site icon NTV Telugu

Chiranjeeva : దర్శకుడిగా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. మైథాలజీ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు

Jai Chiranjeeva

Jai Chiranjeeva

మొట్టమొదటి తెలుగు ఓటీటీగా ముందు నుంచి ఎక్కువ తెలుగు కంటెంట్ అందిస్తూ వస్తున్న ఆహా ఇప్పుడు ఒక కొత్త మైథాలజీ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్, డిసెంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్ ఇటీవల అధికారికంగా విడుదలైంది. ఈ పోస్టర్‌లో ఒక శక్తివంతమైన ఎద్దు శివనామాలతో కనిపిస్తుంది.

Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే..

అదే సమయంలో రోడ్ మీద ఒక యువకుడు దానికి ఎదురుగా నిలబడి కనిపిస్తున్నాడు. ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా రాబోతున్న ఈ సిరీస్ కి జబర్దస్త్ కమెడియన్ అభినయ్ అలియాస్ అదిరే అభి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎ రాహుల్ యాదవ్ మరియు సుహాసిని రాహుల్ నిర్మిస్తున్న ఈ సిరీస్ కి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version