AHA : వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
- ఆహా ఓటీటీ లో "వేరే లెవెల్ ఆఫీస్" వెబ్ సిరీస్
- రామా నాయుడు స్టూడియోలో ట్రైలర్ లాంఛ్
- డిసెంబర్ 12వ తేదీ నుంచి ఆహా లో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది “వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. నేడు ఈ సిరీస్ ట్రైలర్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ఈవెంట్ లో నటుడు అఖిల్ సార్థక్ మాట్లాడుతూ – బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. నాలుగేళ్లుగా ఇలాంటి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. వేరే లెవల్ ఆఫీస్ స్క్రిప్ట్ వినగానే నాకు పర్పెక్ట్ స్క్రిప్ట్ అనిపించింది. మా టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఈ సిరీస్ లో నటించాం. ఒక మంచి సిరీస్ తో మీ ముందుకు రాబోతున్నాం. డిసెంబర్ 12నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ చూడండి. అన్నారు.
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
నటి శుభశ్రీ మాట్లాడుతూ – ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ నా ఫేవరేట్ వెబ్ సిరీస్. అలాంటి ఒక సిరీస్ లో నటించే అవకాశం వస్తే బాగుండేది అని అనిపించేది. ఆ క్రమంలో నాకు వేరే లెవెల్ ఆఫర్ వచ్చింది. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 50 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ రాబోతోంది. మేమంతా సందడిగా షూటింగ్ చేశాం. ఇలాంటి సిరీస్ ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. అన్నారు.
డైరెక్టర్ ఇ సత్తిబాబు మాట్లాడుతూ – తమిళంలో వేరే మాదిరి ఆఫీస్ వెబ్ సిరీస్ పెద్ద సక్సెస్ అయ్యింది. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆహా టీమ్ నన్ను అప్రోచ్ అయ్యారు. తెలుగు కోసం ఒరిజినల్ నుంచి 50 పర్సెంట్ మార్పు చేశాం. మన దగ్గర ఉండే కార్పొరేట్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. స్క్రిప్ట్ వర్క్, ఆర్టిస్టుల సెలెక్షన్ కోసం కావాల్సినంత టైమ్ తీసుకున్నాం. పేరుకు తగినట్లే ఈ సిరీస్ వేరే లెవెల్ లో ఉంటుంది. అన్నారు.
ఆహా కంటెంట్ హెడ్ వాసు మాట్లాడుతూ ‘ఆహాలో ఎన్నో జానర్స్ వెబ్ సిరీస్ లు, షోస్ చేస్తున్నాం. ఒక ఆఫీస్ సిట్ కామెడీ సిరీస్ చేయాలని భావించాం. ఈ కాన్సెప్ట్ యూనిక్ గా ఉంటుందని అనిపించింది. అలా వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ కు ప్లానింగ్ మొదలైంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది. తమిళంలో సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ను మన తెలుగు ఆడియెన్స్ కు మరింత రీచ్ అయ్యేలా తీసుకొస్తున్నాం. ప్యాషనేట్ అండ్ టాలెంటెడ్ టీమ్ తో ఈ సిరీస్ సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు ఆహా తీసుకొస్తోంది’ అన్నారు
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!