After Naga Chaitanya, Samantha Ruth Prabhu Engaged With Raj Nidimoru: నాగచైతన్య- శోభిత ఎంగేజ్మెంట్ వార్త ఇంకా మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక నేషనల్ పోర్టల్ ప్రచురించిన కథనం ప్రకారం సమంత రాజ్ డీకే దర్శకత్వంలో రాజుతో ప్రేమలో ఉందని తెలుస్తోంది. రాజు నిడుమోరు సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చేశారు. ఈ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది.
Adah Sharma: సుశాంత్ సింగ్ మరణించిన ‘దెయ్యం బంగ్లా’లో అదా శర్మ.. షాకింగ్ కామెంట్స్?
ఇక ఒక నేషనల్ పోర్టల్ లో వచ్చిన కథనం ప్రకారం ఒక రెడ్డీట్ పోస్ట్ ప్రకారం రాజ్ సమంత చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఇప్పటికే రాజ్ కి వివాహం జరిగింది. అయితే సమంతతో ప్రేమలో పడిన నేపథ్యంలో మొదటి భార్యకు విడాకులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే నాగచైతన్యతో విడాకులు జరిగిన తర్వాత సమంత పుట్టినరోజు వేడుకలను రాజ్ డీకే టీం చాలా ఘనంగా నిర్వహించింది. అప్పట్లో ఈ వీడియో చర్చనీయాంశమైంది కూడా. ప్రస్తుతం రాజ్ డీకే దర్శకత్వంలోనే సమంత సిటాడెల్ హనీ బన్నీ అని ఒక వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.