Aditya Haasan: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన #90స్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేసిన మొదటి వెబ్ సిరీస్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఆదిత్య హాసన్ కి వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే నితిన్ హీరోగా ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మరో సినిమాకి ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా #90స్ దర్శకుడు ఆదిత్య హాసన్ దర్శకుడిగా ఒక సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్లో ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ చేయబోతున్న ఈ సినిమా లవ్ స్టోరీ అని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ లవ్ స్టోరీ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుందని ఎలా అయితే 90 బయోపిక్ చాలామందికి కనెక్ట్ అయిందో ఈ సినిమా కూడా కనెక్ట్ అయ్యేలాగా ఆదిత్య హాసన్ రాసుకున్నాడని తెలుస్తోంది.
Salaar 2: సలార్ 2 నుంచి షాకింగ్ అప్డేట్.. ఇక పండగే!
Also Read
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
- Sowcar Janaki Health: సీనియర్ నటి 'షావుకారు' జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
విదేశాలకు వెళ్లి చదువుకుని అక్కడ సెటిల్ అయ్యే యువతను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రాసుకున్నారని ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిందని లాక్ చేసేసారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని వచ్చే ఏడాది ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తూనే పలు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తూ వస్తోంది. అందులో మాడ్ స్క్వేర్, అల్లరి నరేష్ సినిమా, అశోక్ గల్లా సినిమా, ఉద్భవ్ రఘు సినిమా అలాగే ఆనంద్ దేవరకొండ వినోద్ అనంతోజు సినిమాతో పాటు స్వాతిముత్యం డైరెక్టర్ తో శ్రీ విష్ణు సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఇప్పుడు ఆ లిస్టులో ఈ కొత్త సినిమా కూడా యాడ్ అయినట్లు అయింది.
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!