ఓ వైపు ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని సినిమా నిర్మాతలు మొత్తుకుంటున్నారు. అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి సినిమాలు ఏవి రావడం లేదు, ఆడియెన్స్ రావడం లేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అందుకు ఓటీటీ కారణం అని కొందరు అంటే కాదు సినిమాలు మంచివి రావడంలేదు అలాగే బాగున్నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మరికొందరి వాదన. ఇలా కారణం ఏదైనా సరే థియేటర్స్ కు మునుపటిలా అయితే రావడంలేదనేది వాస్తవం.
అయితే టికెట్స్ పెంపు అనేది ప్రతి సినిమాకు తీసుకురావడం అనేది ఆడియెన్స్ థియేటర్ కు దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని మెజర్ గా వినిపించే వాదన. ఇటీవల వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాకు కూడా అదనపు రేట్లు తెచ్చారు. ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించినన హిట్ 3 సినిమాకు అదనపు రేట్లు కోసం ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టారు. నేడో లేదా రేపో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. టికెట్ పై ఏకంగా రూ. 50 అలాగే రూ. 75 పెంచుకునేందుకు అనుమతి కోరారు మేకర్స్. హిట్ 3 సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ బ్యానర్ పై హీరో నాని నిర్మించారు. మేకింగ్ పేరుతో కోట్లకి కోట్లు బడ్జెట్ పెంచేయడం, రూపాయి కూడా నార్త్ ప్రమోషన్స్ కోసం భారీగా డబ్బులు పెట్టేసి వాటిని కూడా తెలుగు ప్రేక్షకుల దగ్గర నుండి రాబట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది సామాన్య ప్రేక్షకుడి నుండి వచ్చే ప్రశ్న. ఇలా కోట్లకు కోట్లు బుడ్జెట్ పెంచి అదనపు రేట్లు తెచ్చి థియేటర్ కు జనాలు రావడం లేదు అంటే ఎందుకు వస్తారు. వీళ్లు మారరని.. వీళ్లు ఇంతే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు సగటు సినిమా ప్రేక్షకుడు.