విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రతి ఒక్కరికీ ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్స్ గుర్తుకు వస్తాయి. ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. అక్టోబర్ 30న రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అందరూ ఊహించినట్లు ఇది రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీ కాదని, పక్కా ‘డార్క్ క్రైమ్ కామెడీ’ అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి బాంబ్ పేల్చింది.
త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీలో ఎప్పుడూ చూడని సరికొత్త జానర్ ఇదని, ఆయన రెగ్యులర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వాస్తవానికి త్రివిక్రమ్ అనగానే ఫ్యామిలీ ఎమోషన్స్, భారీ సెట్స్ ఆశిస్తారు. కానీ ఇందులో ఒక క్రైమ్ చుట్టూ తిరిగే డార్క్ కామెడీ ఉంటుందట. ఈ కథ విన్న వెంటనే, ఇంతటి వైవిధ్యమైన ప్రాజెక్టులో భాగం కావాలని తానెంతో ఎక్సైట్ అయ్యానని శ్రీనిధి తెలిపింది. వెంకటేష్ గారికి, త్రివిక్రమ్ గారికి కూడా ఇది ఒక సరికొత్త ప్రయోగం అని, ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

