Site icon NTV Telugu

Samantha: తిరుమలలో డిక్లరేషన్ సమర్పించి శ్రీ వారి దర్శనానికి సమంత

Samantha

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆమె క్రిస్టియన్ కావడంతో ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో డిక్లరేషన్ సమర్పించింది. తాను అన్యమతస్థురాలైనప్పటికీ శ్రీవారిపై నమ్మకం ఉండటంతో దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో అధికారులు ఆమెను శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. సమంత నిర్మాతగా ‘శుభం’ అనే సినిమాను రూపొందించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఆ సినిమా యూనిట్‌తో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత సహా సినిమా యూనిట్ సభ్యులందరూ ఆలయానికి చేరుకున్నారు.

HCA : టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్‌..

ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంత సహా టీమ్‌కు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమంత గత ఏడాది ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘శుభం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, సినిమా బృందంతో కలిసి ఆమె తిరుమల రావడం గమనార్హం.

Exit mobile version