Site icon NTV Telugu

Samantha Instagram: స‌మంతకు.. నెల‌కు అన్ని కోట్లా..!

Samantha

Samantha

‘ఏమాయ చేశావే’ చిత్రంతో అరంగ్రేటం చేసిన సమంత.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయ‌ చేసింది. అన‌తికాలంలోనే స్టార్ హీరోలంద‌రితో క‌లిసి సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆక‌ర్షిస్తుంటుంది. స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా పాల్గొంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అంతేకాకుండా బ్రాండ్‌లను కూడా ప్ర‌మోట్ చేస్తుంది. అయితే ఈమె బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనే ప్ర‌శ్న అందరి మ‌దిలో మెదులుతూ ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్ర‌స్తుతం 24 మిలియ‌న్ల్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. కాగా స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా నెల‌కు దాదాపు రూ.2 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తుంద‌ట‌. ఇక సామ్ ప్ర‌తి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం స‌మంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాల‌ను చేస్తుంది. ఈ లెక్క‌న చూసుకుంటే సినిమాల‌తో కంటే సోష‌ల్ మీడియా ద్వారానే సామ్ ఎక్కువ‌గా సంపాదిస్తుంది.

ఇటీవ‌లే స‌మంత న‌టించిన ‘క‌తు వాకుల రెండు కాద‌ల్’ మంచి విజయం సాధించింది. న‌య‌న‌తార మ‌రో ప్ర‌ధాన హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌స్తుతం ఈమె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘శాకుంత‌లం’ సినిమా చేస్తుంది. దీనితో పాటు ‘య‌శోదా’, విజ‌య్‌తో ‘ఖుషి’ సినిమాల‌ను చేస్తుంది.

Srilanka: 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లు.. ప్రశంసల వర్షం

Exit mobile version