తమిళ హీరోయిన్ నమిత తాజాగా తిరుమలలో దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతంరం ఆమె మీడియాతో మాటాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న “భౌభౌ” సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలా ? లేకపోతే ఓటిటిలో రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నమిత ఓటిటి యాప్ ను, నమిత ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరలోనే ప్రారంభిస్తున్నాను అని ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ నటిగా మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతగానూ సినిమాలను నిర్మించి అలరించబోతోందన్న మాట.
Read Also : రివ్యూ : స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్ (జీ 5)
ఇక “జెమినీ” చిత్రంతో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నమిత. ఆ తరువాత పలు చిత్రాలతో అలరించిన ఈ భామ తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మిస్ సూరత్ 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్రను తిరుపతిలోనే వివాహం చేసుకుంది. నమిత పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది.