Kayadu Lohar: సోషల్ మీడియాకు పారడైజ్ హీరోయిన్ గుడ్‌బై.. కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: టాలీవుడ్ యంగ్ బ్యూటీ, కన్నడ కస్తూరి కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్ (డిజిటల్ డిటాక్స్) ప్రకటిస్తూ అభిమానులకు షాకిచ్చారు. ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కోసం, స్క్రీన్ లైఫ్‌కు దూరంగా ఉంటూ కాస్త సమయాన్ని తన కోసం కేటాయించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కయాదు చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది పారడైజ్’ (The Paradise) లో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. దీనితో పాటు సౌత్‌లోని అన్ని ప్రధాన భాషల్లోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగం అయ్యారు.ఈ క్రమంలో ఆమె తన పూర్తి ఏకాగ్రతను సినిమాల పైన, తన నటన పైన ఉంచాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ సోషల్ మీడియా విరామ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. “సోషల్ మీడియా నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. మన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మనసుకు కూడా అంతే విశ్రాంతి కావాలి. కొద్దిరోజులు ఈ స్క్రీన్ ప్రపంచానికి దూరంగా జరిగి, నా కోసం నేను సమయం గడపాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన, ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను అందుబాటులో లేకపోయినా, నా సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ను నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. అందరూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా.. త్వరలోనే మళ్లీ కలుద్దాం” అని రాసుకొచ్చారు. సినిమాల కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెడుతున్న ఈ బ్యూటీ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు, అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!