NTV Telugu Site icon

Acteress Kasturi : కష్టాల సుడిలో కస్తూరి.. అరెస్ట్ కు రంగం సిద్ధం

Kasturi

Kasturi

అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడు వచ్చిన తెలుగు వారు, ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పై తెలుగు సంఘాల ఫిర్యాదుతో చెన్నై మదురై సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విచరణకు పిలిచేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ఫోను స్విచ్ ఆఫ్ అవ్వడంతో నోటీసులను ఇంటికి అతికించి వెళ్లారు. ఎవరికి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళింది కస్తూరి.

Also Read : Ram Charan : కడప దర్గాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

గత వారం రోజులుగా పరారీలో ఉన్న నటి కస్తూరి మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తన మాటలను వెనక్కి తీసుకుని తెలుగు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారంటూ పిటిషన్ లో నటి కస్తూరి పేర్కొంది. నేడు కస్తూరి బెయిల్ పై విచారించిన ధర్మాసనం కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ స్వపయోజనాల కోసం తెలుగు వారు తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగే విధంగా మాట్లాడడం ముమ్మాటికీ తప్పేనని న్యాయమూర్తి వారించారు. ఆమె దాఖలలు ముందస్తూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పరారీలో ఉన్న నటి కస్తూరి ముందస్తూ బెయిల్ కోర్టు కొట్టేవేయండంతో కస్తూరి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న కస్తూరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. నేడో లేదా రేపో కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Show comments