NTV Telugu Site icon

Vinayakan: మందేసి రెచ్చిపోయిన జైలర్ విలన్.. చివరికి క్షమాపణలు !

Vinayakan

మద్యం మత్తులో ఉన్న జైలర్ విలన్, నటుడు వినాయకన్ తన పొరుగువారిపై అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, వినాయకన్ తన ఫ్లాట్ బాల్కనీలో పక్కింటి వారితో గొడవ పడుతూ అసభ్యంగా మాట్లాడడమే కాదు లుంగీని అసభ్యంగా ధరిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఫుటేజీ తమకు అందిందని ఎర్నాకులం నార్త్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఫ్లాట్ బాల్కనీలో వినాయకన్ నిల్చున్న దృశ్యాలు వైరల్ కావడంతో అతను హద్దులు మీరిపోయారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో విషయంలో నటుడు వినాయకన్ క్షమాపణలు చెప్పారు.

Ravi Abburi: నేను ఇక ఆపేస్తా.. చాలు.. టాలీవుడ్ రచయిత సంచలనం!

“సినిమా నటుడిగా మరియు వ్యక్తిగా నేను చాలా సమస్యలను ఎదుర్కోలేను. నా వైపు నుండి వచ్చిన ప్రతికూల శక్తికి నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. చర్చలు కొనసాగనివ్వండి..” అని మలయాళంలో రాసుకొచ్చాడు. ఇక వినాయకన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటి సారి కాదు, ఇంతకుముందు చాలాసార్లు ఆయన వివాదాల్లో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేట్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకున్న వినాయకన్‌ నేలపై కూర్చొని అరుస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. వినాయకన్‌ను విచారణకు పిలిచినప్పుడు పోలీసు స్టేషన్‌లో రచ్చ సృష్టించినందుకు అతనిపై కేసు కూడా నమోదైంది.