Site icon NTV Telugu

Actor Srikanth: వారసుడు 100శాతం పక్కా హిట్

Srikanth On Divorce

Srikanth On Divorce

Actor Srikanth: రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు సీనియర్ యాక్టర్ శ్రీకాంత్.. ఓ వైపుగా హీరోగా రాణిస్తూనే.. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‎లో ‘వారసుడు’ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. కాగా, తొలుత రెండు భాషల్లోనూ సినిమాను ఈ నెల 11న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ ఈ నెల 14వ తేదీకి వెళ్లింది. ఈ సినిమాలో విజయ్ కి సోదరుడి పాత్రలో శ్రీకాంత్ నటించాడు. ఇటీవల శ్రీకాంత్ మాట్లాడుతూ .. ‘వారసుడు’లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందువలన అన్ని ప్రాంతాలవారికి .. అన్ని భాషలవారికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తమిళ అనువాదంలా కాకుండా, తెలుగు సినిమా మాదిరిగానే అనిపిస్తుంది.

Read Also: Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు

కోలీవుడ్ నుంచి ఇంతకుముందు నాకు ఎన్ని అవకాశాలు వచ్చిన చేయలేకపోయాను. తమిళంలో నేను చేసిన మొదటి సినిమా ఇదే. అదీ విజయ్ లాంటి స్టార్ హీరోతో కలిసి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ మాస్ యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చారు. రొటీన్ కి భిన్నంగా ఆయన చేసిన సినిమా ఇది. ఆర్టిస్టులంతా తెలుగు సినిమాలు చేసినవారే .. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినవారే. అందువలన ఈ సినిమాను తెలుగులో చేసినట్టుగానే ఉంటుంది. మదర్ సెంటిమెంట్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. తమన్ పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. తప్పకుండా ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాం. కానీ దిల్ రాజు గారు కాల్ చేసి 14వ తేదీకి వెళుతున్నట్టు చెప్పగానే షాక్ అయ్యాను. ఇతరుల నిర్ణయాన్ని గౌరవించి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం నిజంగా విశేషమే” అన్నారు.

Exit mobile version