ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి ఇటీవలే “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తన పేరు ప్రియదర్శికి అర్థం ఏంటో చెప్పుకొచ్చారు. ప్రియదర్శి అంటే బుద్ధుడికి మరో పేరు అని చెప్పుకొచ్చారు.
Read Also : పవర్ స్టార్ పేరు మార్చేసిన బండ్ల గణేష్
సినిమా ఇండస్ట్రీలో తన బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లే ఉందని, లేనట్లే లేదని వెరైటీ సమాధానం ఇచ్చారు. పరిశ్రమలోకి రావడానికి ముందుగా కాస్త ఇబ్బంది పడ్డానని, కానీ తరువాత ప్రయాణం సాఫీగానే సాగిందని చెప్పుకొచ్చారు. తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు అవకాశాలు ఇచ్చి తనను ముందుకు లాగుతున్నారని అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’లో ఓ పాత్ర చేశానని, ఇంకా టైటిల్ ఖరారు చేయని రెండు చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చారు.