రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఆమె హార్డ్ డిస్క్లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని ప్రస్తావించింది. దీంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో హీరో నిఖిల్ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు.
Saudi Film Nights: హైదరాబాద్‌లో సౌదీ ఫిలిమ్ నైట్స్
కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలు అవి, అక్కడ ఉన్నది కూడా మా కుటుంబ సభ్యులే అని అయన
అన్నారు. వాస్తవం ఏంటి అనేది పోలీసులకు కూడా తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్లో దాదాపు 300 నుంచి 400 మంది అమ్మాయిలు వీడియోలతో పాటు పలువురి వ్యక్తుల ప్రైవేటు వీడియోలు ఉన్నాయని లావణ్య ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హీరో నిఖిల్ ప్రస్తావన కూడా పెద్ద ఎత్తున వచ్చింది ఇక తాజాగా ఇదే అంశం మీద నిఖిల్ క్లారిటీ ఇచ్చినట్లయింది.