NTV Telugu Site icon

Anchor Suma: స్టేజ్ మీద సుమ చేతిని ముద్దాడిన నటుడు.. షాకింగ్ కామెంట్స్

Anchor Suma Hand Kiss

Anchor Suma Hand Kiss

Actor Daniel hand kiss to Suma Kanakala on stage goes viral: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Neeraj Chopra: రేపే క్వాలిఫికేషన్ రౌండ్‌.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్‌ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్

తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోండగా తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటించిన హాలీవుడ్ నటుడు డేనియల్ మాట్లాడుతూ మా బ్రదర్ విక్రమ్, డైరెక్టర్ పా రంజిత్, మాళవిక, పార్వతీ వీళ్లంతా లేకుంటే “తంగలాన్” సినిమా జరిగేది కాదు. నన్ను ఈ మూవీలోకి తీసుకొచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు థ్యాంక్స్. “తంగలాన్” ఒక అమోజింగ్ మూవీ. అమోజింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. థియేటర్ లో తప్పుకుండా చూడండన్నారు. అన్న తరువాత ఈ ఈవెంట్ యాంకరింగ్ చేస్తున్న సుమ చేతిని ఆయన ముద్దాడాడు. దీంతో ఓహ్ షాక్ అయిన సుమ కాస్త తేరుకుని రాజా(భర్త రాజీవ్ కనకాల) ఈయన మా అన్నయ్య, రాఖీ వస్తోంది కదా అంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Show comments