NTV Telugu Site icon

Darshan: దర్శన్ కేసుపై పుష్ప జాలిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. తమ్ముడిని అంటూనే!

Dhanunjaya Darshan

Dhanunjaya Darshan

Actor Daali Dhananjaya Speaks About Darshan in Renuka Swamy Murder Case: కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గకు రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప జైలుకు వెళ్లాడు. ఈ కేసులో 2వ నిందితుడుగా ఉన్న దర్శన్ మీద చాలా మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దర్శన్ అరెస్టు గురించి స్పందించమని అడిగితే కొద్దిరోజుల క్రితం కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ ‘డాలీ’ ధనంజయను ప్రశ్నించగా, స్పందించేందుకు నిరాకరించారు. అయితే బుధవారం (జూలై 10) ఆయన తొలిసారి దీనిపై స్పందించారు. చట్టాన్ని మించిన వారు లేరని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని అన్నారు. ముందు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. విషాదం జరిగింది, ఒక జీవితం పోయింది, తప్పు జరిగింది. ఆ వ్యక్తి (రేణుకా స్వామి) తల్లిదండ్రుల ముఖం చూసి, ఆ వ్యక్తి భార్య ముఖం చూసి అయినా న్యాయం చేయాల్సిందే. చట్టాన్ని మించిన వారు ఎవ్వరూ లేరు, దానిని మించిన గొప్పవారు ఎవ్వరూ లేరు అని నటుడు ‘డాలీ’ ధనంజయ అన్నారు.

Venky Anil3: యానిమల్ నటుడిని దింపుతున్న రావిపూడి

‘‘ఈ కేసు బాధితులు మా వాళ్లో, మీ వాళ్లో అయితే, అలాగే నిందితుడు మనలో ఒకరైతే ఎలా ఉంటుంది? చాలా షాకింగ్ అనిపించింది. ఈ విషయం తెలియగానే చాలా ఫీలయ్యాను. దర్శన్ గురించి అడిగినప్పుడు, మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమిస్తున్నామనే అన్నాడు ధనంజయ. ఇక్కడ దేనినీ సమర్థించలేము ఎంహెదుకంటే ప్రతిదానికీ ఒక చట్టం ఉంది. దాని ద్వారా ఏమి జరగాలో అది జరుగుతుంది. మనం ఏమి మాట్లాడినా ప్రయోజనం లేదని అనిపిస్తుంది. అక్కడ ఏమి జరిగిందో మనలో ఎవరూ చూడలేదు, కానీ చట్టానికి తెలుసు. అతని (దర్శన్) సోదరుడిగా నేను చెబుతున్నాను, అతని తప్పు ఉంటే శిక్ష పడుతుందని ధనుంజయ అన్నాడు. చట్టపరంగా ఏది జరగాలో, అది జరుగుతుంది. నేను కూడా మేధావిని కాదు. నేను ఎమోషనల్‌గా మాట్లాడుతున్నాను. అక్కడ జరిగిన దానిని ఎవరూ సమర్థించ లేరు, ఆ చర్యను ఎవరూ సమర్థించలేరని అన్నాడు.