Site icon NTV Telugu

ప్రేమలో పడ్డ ‘మేజర్’… ఆ అమ్మాయి ఎవరంటే..!?

Actor Adivi Sesh in love with a Hyderabad girl

యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా అప్డేట్లతో తరచూ వార్తల్లో నిలిచే ఈ యంగ్ హీరో తాజాగా లవ్ మేటర్ తో చర్చనీయాంశంగా మారాడు. గతంలో ఈ హీరో ఒక బాలీవుడ్ నటిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శేష్ వాటిపై స్పందించలేదు. తాజాగా ఆయన తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యువ హీరో తాను హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని చాలాకాలంగా ప్రేమిస్తున్నానని తెలిపాడు. అయితే అతను ఆ అమ్మాయి వివరాలను వెల్లడించలేదు. ఈ విషయంలో తన ప్రేయసి అనుమతి తీసుకోలేదని, ఆమెతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. ప్రేమలో ఉన్నప్పటికీ ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని, మొదట తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నామని, అలాంటి సమయంలో కొత్త బాధ్యతలు తీసుకోలేమని పేర్కొన్నాడు. అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు.

Exit mobile version