Site icon NTV Telugu

Kaalidhar Laapata : ఎమోష‌న‌ల్‌గా ఆకటుకుంటున్న అభిషేక్ బ‌చ్చన్ ‘కాళిధర్ లపతా’ ట్రైల‌ర్

Abhishek Bachchan ‘kaalidhar Laapata’

Abhishek Bachchan ‘kaalidhar Laapata’

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లకు కాకుండా జూలై 4న జీ5 ఓటీటీ వేదిక పై నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మెకర్స్.

Also Read : Predarshi : ‘మిత్ర మండలి’ నుండి మొదటి సింగిల్‌ విడుదల.. !

ఇక ట్రైలర్‌ను గనుక పరిశీలిస్తే, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ కథ ప్రధానంగా ఒక వృద్ధుడైన కాళిధర్ చుట్టూ తిరుగుతుంది. ఆస్తి కోసం, అతని కుటుంబం తనను పక్కన పెట్టాలనుకుంటుందన్న విషయం తెలుసుకున్న కాళిధర్ (అభిషేక్ బచ్చన్), ఇంటి నుంచి ఎవరికీ తెలియకుండా పారిపోతాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లు అనే బాలుడితో అనుకోని పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ఆ బంధం ఎలా పెరిగిందో, కాళిధర్ జీవితంలో బల్లు ప్రవేశం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఏమిటో, చివరికి కుటుంబ సభ్యులు అతడిని వెతికి పట్టుకుంటారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కాగా ఈ మూవీలో ఇన్నోసెంట్ యాక్టింగ్ తో డిగ్లామర్ లుక్ లో కనిపించారు అభిషేక్ బచ్చన్.. చాలా రోజులకు ఆయన మంచి కం బ్యాక్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది.

 

Exit mobile version