సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది సాధారణం అయిపోయింది. అభిమానులు ప్రేమను వ్యక్తం చేసే విధంగా కామెంట్లు చేస్తే, కొందరు మాత్రం విమర్శలతో, వ్యంగ్యాలతో ముందుకు వస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారు. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రంలో చూపించిన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. అయితే, ఈ అవార్డు నిజంగా ఆయనకు రావాలా లేదా అనే చర్చ నెటిజన్లలో మొదలైంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అభిషేక్‌ను ట్యాగ్ చేస్తూ, “ఆయన అవార్డులు కొనుక్కుంటారు, కెరీర్‌లో ఒక్క సొలో బ్లాక్‌బస్టర్ కూడా లేదు, కానీ బలమైన పీఆర్ టీమ్ వల్లే పేరు నిలబెట్టుకుంటున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, “అభిషేక్‌కి కన్నా బాగా నటించే వారు ఉన్నారు కానీ వాళ్లకు అవార్డులు రావటం లేదు” అని కూడా ఎక్స్‌లో పోస్టు చేశాడు.
Also Read : Mahakali : వచ్చేసిన మహాకళి అప్‌డేట్.. ఇన్ స్టా రీల్స్ చేసుకునే అమ్మయికి బ్రేక్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
దీనిపై అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో కూల్‌గా కానీ బలమైన రిప్లై ఇచ్చారు.. “మీకు సూటిగా చెప్పాలనుకుంటున్నా నేను ఇప్పటివరకు ఒక్క అవార్డు కూడా కొనుక్కోలేదు. నా కోసం ఎటువంటి పీఆర్ టీమ్ పనిచేయడం లేదు. నాకు తెలుసు కష్టపడి పనిచేయడం, రక్తం, చెమట, కన్నీళ్లతో నా స్థానం సంపాదించుకోవటం మాత్రమే. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. కానీ మీ మాటలు తప్పని నిరూపించడానికి నేను చేయగలిగిన ఉత్తమ మార్గం ఒక్కటే ఇంకా కష్టపడి పని చేయడం. భవిష్యత్తులో నా పనితీరే మీ నోరు మూయిస్తుంది” అంటూ అభిషేక్ గౌరవభావంతో స్పందించారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ‘బి హ్యాపీ’, ‘హౌస్‌ఫుల్ 5’, ‘కాళీధర్ లాపతా’ వంటి సినిమాల్లో నటించారు. ఇక త్వరలో ‘కింగ్’ మరియు ‘రాజా శివాజీ’ చిత్రాల్లోనూ ఆయన ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ట్రోల్స్‌కి సమాధానం చెప్పిన విధానం, ఆయనలోని ప్రొఫెషనలిజం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
