Site icon NTV Telugu

Abhirami: కమల్ హాసన్‌తో లిప్ కిస్ పై స్పందించిన నటి అభిరామి..

Abhirami, Kamal Haasan

Abhirami, Kamal Haasan

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అయితే ట్రైలర్ మొత్తంలో కమల్ అభిరామితో లిప్ లాక్, ఇక తన ప్రియురాలు త్రిషతో రొమాంటిక్ సన్నివేశాలు ఎట్రాక్టివ్‌గా ఉన్నాయి.

Also Read : Squid Game 3 : ‘స్క్వేడ్ గేమ్ 3’ ట్రైలర్ రిలీజ్..

మేడమ్.. ఐయామ్ ఓన్లీ యువర్ ఆడమ్‌ను అంటూ కమల్ చెప్పిన రొమాంటిక్ డైలాగ్స్ క్రేజీగా ఉంది. త్రిషా కూడా గ్లామర్ పాత్రతోనే కాకుండా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని ట్రైలర్ లో క్లియర్‌గా తెలుస్తోది. ముఖ్యంగా అభిరామితో లిప్ లాక్ పై సోషల్ మీడియాలో చిన్నపాటి డిబేట్ నడిచింది. అయితే తాజాగా ఈ విషయంపై తాజాగా నటి స్పందించింది.. ‘చిత్రనిర్మాతల నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. ట్రైలర్‌లో కమల్ హాసన్‌తో చిన్న క్లిప్ కారణంగా చాలా అపార్థాలు చోటుచేసుకున్నాయి.. ముద్దు విషయం ఆ సన్నివేశాన్ని నేను ఇష్టపూర్వకంగానే చేశాను. పూర్తి సినిమా చూసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు మారుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సినిమా విడుదల తర్వాత దీని గురించి కనీసం మాట్లాడుకోరు కూడా . నిజానికి ఈ అంశంపై అంతగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ సినిమా చూడాలని నేను కోరుతున్నాను’ అంటూ ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చింది అభిరామి.

Exit mobile version