NTV Telugu Site icon

AAY : ఆయ్AAY : ఆయ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్

Untitled Design 2024 08 14t142016.344

Untitled Design 2024 08 14t142016.344

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.

Also Read: JR.NTR: జస్ట్ వన్ క్లిక్ తో.. గ్లోబల్ స్టార్ ‘తారక్’ టాప్ 3 అప్ డేట్స్..

హీరో నిఖిల్ మాట్లాడుతూ “స్వయంభు షూటింగ్ వల్ల బయటకు రాలేకపోతోన్నాను. సోషల్ మీడియాలో ఆయ్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్డు మీదే ఫుడ్ తింటూ నితిన్ గారు ప్రమోట్ చేశారు. ఓ మంచి సినిమా, యంగ్ టీం ముందుకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలని ఇక్కడకు వచ్చాను. జాతి రత్నాలు, మ్యాడ్, బేబీ మేకర్లు ఇక్కడకు వచ్చారు. చిన్న చిత్రం కూడా వంద కోట్లు కొల్లగొట్టొచ్చని నిరూపించారు. ఆయ్ కూడా ఆ కోవలోనే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ తరువాత నితిన్‌కు మళ్లీ మంచి చిత్రం పడింది. కసిరాజు, అంకిత్, సారికల మ్యాజిక్ చూడాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 15న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని అన్నారు.

Also Read : DoubleISMART; డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?

యంగ్ బ్యూటీ శ్రీలీల మాట్లాడుతూ “నితిన్ గారి మ్యాడ్ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆయ్ చిత్రంలో హ్యూమర్ చాలా ఉందని అర్థం అవుతోంది. నాకు ఇలాంటి చిత్రాలే చాలా ఇష్టం. అందుకే అనుదీప్ గారెతో నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. గోదావరి ప్రాంతం, ఆ యాస అంటే నాకు చాలా ఇష్టం. ఆగస్ట్ 15న అందరూ అన్ని చిత్రాలను చూడండి” అని అన్నారు.

Show comments