NTV Telugu Site icon

Aamir Khan : సినిమాలకు స్టార్ హీరో అమీర్ ఖాన్ స్వస్తి.. కానీ..?

Amir Khan

Amir Khan

అమిర్ ఖాన్ నిర్మాతగా అయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాస్ట్‌ లేడీస్‌’ ( ఇంగ్లీష్ ప్రేక్షకులకు వీలగా ‘లపాతా లేడీస్’ పేరు మార్చారు). ఈ సినిమా 2025 ఆస్కార్‌ అవార్డ్స్ కు ఇండియా తరపున అధికారికంగా ఎంపిక కావడంతో నిర్మాత అమిర్ ఖాన్ ఈ సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో ఇంగ్లీష్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అమిర్ ఖాన్ .

Also Read : Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్

లాస్ట్ లేడీస్ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అమీర్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరిచాయి. అమీర్ మాట్లాడుతూ ” కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా చాలా నెలలు సినిమాలు, షూటింగ్స్ కు బాగా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెంట్ చేశాను. సినిమాలు, షూటింగ్స్ తో అప్పట్లో ఫ్యామిలీకి టైమ్ ఇవ్వలేకపోయానని చాలా భాధగా అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే ఆ ఆలోచన నన్ను ఎంతగానో బాధించింది. ఇక సినిమాలు చాలు ఇండస్ట్రీ నుండి తప్పుకుందాం అనుకున్న. అదే నిర్ణయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పేశా. ఆ మాటలకు వారు షాక్ అయ్యారు. ఆ సమయంలో కిరణ్‌ రావు నాకెంతో అండగా నిలిచింది. నా ఆలోచన విధానం నాకు అర్థమయ్యేలా చెప్పి నేను మరలా నార్మల్ అయ్యేలా చేసింది. దాంతో కొద్దీ రోజుల తర్వాత నా నిర్ణయం మార్చుకుని తిరిగి సినిమాలు చేయాలని సిద్ధమయ్యా’’ అని ఆమిర్‌ ఖాన్‌ అన్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తమిళ్ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నాడు.

Show comments