బాలీవుడ్ మిస్టర్ పెర్ఫేక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్‌పర్’. 2007లో విడుదలై ప్రేక్షకుల మనసులను కదిలించిన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి ఇది కొనసాగింపుగా తెరకెక్కుతోంది. గత చిత్రం చిన్నారి మానసిక సమస్యల పై కేంద్రీకృతమై ఉండగా, ఈసారి కథను స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్యనిధి శర్మ కథ అందించారు. ఆమిర్ ఖాన్ తన ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వచ్చిన భారీ ఆఫర్‌ను, ఆమిర్ ఖాన్ తిరస్కరించినట్టు సమాచారం.
Also Read : Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం..
ఈ మధ్యకాలంలో ఓటీటీ వేదికలు బాగా చలామణి అవుతున్నాయి. పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన కొద్దికాలంలోనే డిజిటల్‌లోకి వచ్చేస్తున్నాయి. కానీ థియేటర్ల అనుభూతిని ప్రాధాన్యతగా భావించే అమీర్ ఖాన్.. ఈ OTT లపై ఎప్పుడు నిప్పులు కక్కుతునే ఉంటాడు. ఇందులో భాగంగానే తాజా సమాచారం ప్రకారం ‘సితారే జమీన్‌పర్’ మూవీ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ.120 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకు రాగా, ఈ డీల్‌ను సున్నితంగా తిరస్కరించారు. ప్రజంట్ జనాలపై ఉన్న ఓటీటీ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఆమిర్ నిర్ణయానికి సినీ అభిమానులు కూడా భారీగా మద్దతు ఇస్తున్నారు.
